Monday, January 20, 2025

రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డిఎస్‌పి

- Advertisement -
- Advertisement -

 

ఆసిఫాబాద్/రెబ్బెనః రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను డిఎస్‌పి శ్రీనివాస్ శనివారం తనిఖీ చేశారు. మొదటి సారి పోలీస్ స్టేషన్‌కి వచ్చిన సందర్భంగా పోలీస్ సిబ్బందితో పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న 17 వర్టికల్స్ ఫంక్షనింగ్ సిస్టంని పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేశారు. రిసెప్షన్, బ్లూకోల్ట్, క్రైమ్ టీం, కోర్టు డ్యూటి ఆఫీసర్, స్టేషన్ రైటర్, క్రైమ్ రైటర్, ప్రాసెస్ అప్లికేషన్‌ల ద్వారా తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల ఫైల్స్, రికార్డులను పరిశీలించారు. అలాగే నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పోలీస్ స్టేషన్‌కి వచ్చే వారితో మర్యాదగా మెలాగాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గ్రామాల్లో గస్తీ పెంచాలని అన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ అవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సిఐ అల్లం నరేందర్, ఎస్‌ఐ భూమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News