- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు విఆర్‌సి సెంటర్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కావలి డిఎస్‌పి వెంకటరమణపై చర్యలు తీసుకోవాలంటూ బిజెపి ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. బిజెపి కార్యకర్త తలను కాళ్ల మధ్య డిఎస్‌పి నొక్కిపెట్టారు. దీంతో డిఎస్‌పిపై చర్యలు తీసుకోవాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. బిజెపి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
Also Read: కడపలో జీపును ఢీకొట్టిన లారీ: ఏడుగురు మృతి
- Advertisement -