Saturday, January 11, 2025

ట్యాపింగ్ కేసులో డిఎస్‌పి ప్రణీత్ కుమార్ సస్సెండ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాల్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబి డిఎస్‌పి ప్రణీత్ రావు సస్సెండ్‌కు గురయ్యాడు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో డిఎస్‌పిగా ప్రణీత్ పని చేస్తున్నారు. ప్రణీత్ కుమార్ కాల్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు లభించాయి. నిబంధనలకు విరుద్ధంగా ప్రణీత్ కుమార్ వ్యవహరించినట్లు గుర్తించారు. కంప్యూటర్లలోని 42 హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ మార్చడంతో పాటు వాటిని ధ్వసం చేసినట్టు గుర్తించారు. సిసి కెమెరాలు ఆఫ్ చేయించి హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు తేలింది. అనుమతి లేకుండా ప్రణీత్ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లకూడదని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్యనేతలు సహా మాజీ సిఎం కెసిఆర్‌కు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించిన వారి ఫోన్ల ట్యాపింగ్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఎస్‌ఐబితో సహా ఇతర కీలక విభాగాలనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News