- Advertisement -
మల్దకల్ : శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురువారం గద్వాల డిఎస్పీ రంగస్వామి ఆయన గురువు రిటైర్డ్ ఎస్పీ మాధవరెడ్డితో కలిసి సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వారిని అరవిందరావు స్వామివారి శేష వస్త్రంతో చరిత్ర పుస్తకం అందజేసి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూధన్‌రెడ్డి, ఎస్‌ఐ శేఖర్, ఏఎస్‌ఐ ఈశ్వరయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతరం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని గురువారం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ సందర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -