Thursday, January 23, 2025

సబ్దల్‌పూర్‌ను సందర్శించిన డిఎస్పీ

- Advertisement -
- Advertisement -

ఎల్లారెడ్డి : మండలంలోని సబ్దల్‌పూర్ గ్రామాన్ని గురువారం ఎల్లారెడ్డి డిఎస్పీ సందర్శించారు. బుధవారం సబ్దల్‌పూర్ గ్రామస్థులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆధారంగా చేసుకుని గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. గ్రామ శివారులో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో చర్చ్ నిర్మాణానికి కొందరు ప్రయత్నిస్తున్నారని పనులు నిలిపివేసి గ్రామంలో ప్రశాంతతను కాపాడాలని గ్రామస్థులు అధికారులకు వినతి పత్రాన్ని బుదవారం ఇచ్చిన సందర్భంగా ఆయన గ్రామానికి వెళ్లి అక్కడ పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చర్చ్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నిస్తున్న స్థలం వ్యవసాయ భూమి అని నాలా కన్వర్షన్ కాకుండా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణం పనులు చేపట్టడం సరికాదన్నారు. తమశీల్దార్, ఎంపిడివో, స్థానిక సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలతో ఆర్డివో శ్రీను మాట్లాడి అక్రమ నిర్మాణం పనులు కొనసాగకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. స్థానికులతో మాట్లాడి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News