Monday, December 23, 2024

టెర్రఫిక్ లుక్‌లో మాస్ మహారాజా..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ధమాకా’ పాటలు, టీజర్ అద్భుతమైన స్పందనతో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమా నుండి ‘డు డు..’ సాంగ్ ని ఈనెల 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ్ లుక్ టెర్రిఫిక్‌గా వుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

‘Du Du’ Song from Dhamaka to release on Nov 25

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News