Saturday, November 16, 2024

సారే జహా సే అచ్చా కవి ఇక్బాల్ చాప్టర్ తొలగింపు: డియు నిర్ణయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిఎ డిగ్రీ కోర్సులోని పొలిటికల్ సైన్స్ సిలబస్ నుంచి పాకిస్తాన్ జాతీయ కవి మొహమ్మద్ ఇక్బాల్ చాప్టర్‌ను తొలగించాలని నిర్ణయిస్తూ ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అకాడమిక్ కౌన్సిల్ శుక్రవారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయాన్ని కౌన్సిల్ ధ్రువీకరించింది. అవిభక్త భారతదేశంలోని సియాల్‌కోట్‌లో 1877లో జన్మించిన ఇక్బాల్ ప్రసిద్ధ గీతం సారా జహా సే అచ్చా రచించారు. పాకిస్తాన్ పుట్టుకకు ఆయన ఆలోచనే కారణమని కూడా చరిత్రకారులు చెబుతారు.

బిఎ డిగ్రీ కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌లో మాడర్న్ ఇండియన్ పొలిటికల్ థాట్ అనే చాప్టర్ మొహమ్మద్ ఇక్బాల్ ప్రస్తావన ఉంటుంది. ఆయనకు సంబంధించిన చాప్టర్‌ను తొలగించాలన్న అకాడమిక్ కౌన్సిల్ తీర్మానంపై యూనివర్సిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ కైన్సిల్ తుది నిర్ణయం తీసుకోనున్నది. ఇక్బాల్‌తోపాటు రామమహన్ రాయ్, పండిత రమాబాయి, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, భీంరావు అంబేద్కర్‌కు సంబంధించిన చాప్టర్లు కూడా పొలిటికల్ సైన్స్ పేపర్‌లో ఉన్నాయి.
కాగా..తాజా పరిణామాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎబివిపి స్వాగతించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News