- Advertisement -
తిరుమల: దుబాయ్ లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం.హనుమంత కుమార్ శుక్రవారం టీటీడీకి రూ.కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డికి ఈ మేరకు డిడి అందజేశారు. టీటీడీ అభీష్టం మేరకు ఈ సొమ్ము ఏ ట్రస్ట్ కైనా జమచేసుకోవాలని దాత కోరారు.
గో సంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
టీటీడీ గో సంరక్షణ ట్రస్టుకు సికింద్రాబాద్ కు చెందిన పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్ శుక్రవారం రూ.10,01,116( పదిలక్షల వెయ్యి నూట పదహారు) విరాళంగా అందించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాపు కార్యాలయంలో ఈ మేరకు డిడిని టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డికి అందజేశారు. చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి నేతృత్వంలో గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.
Dubai Based Devotee donates Rs 1 Crore to TTD
- Advertisement -