దుబాయ్ నుంచి జమైకా చేరుకున్న విమానాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెనక్కి పంపింది. జమైకా చేరుకున్న విమానంలో చాలా మంది భారతీయులు ఉన్నారు. అయితే విమానానికి సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా ఈ విధంగా చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. జమైకా చేరుకున్న చాలా మంది ప్రయాణికులు ఐదు రోజుల పర్యటన కోసం అక్కడకు వచ్చినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిపారు.
వీరిలో కొందరు అక్కడ ఉండడానికి ముందుగానే హోటల్స్ బుకింగ్ చేసుకున్నారు. వీరి వద్ద పర్యటనకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లతో అధికారులు సంతృప్తి చెంద లేదు. దీంతో వారిని వెనక్కి పంపినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. మే 7న మధ్యాహ్నం చార్టర్డ్ విమానం జమైకా నుంచి బయలుదేరింది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది భారతీయులు కాగా, ఇద్దరు ఉజ్బెకిస్థాన్, రష్యాకు చెందిన వారు ఉన్నట్టు జమైకన్ అధికారులు పేర్కొన్నారు.