- Advertisement -
షార్జా: దుబాయ్‌లో కొత్తగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని బుధవారం భారీ వేడుకలో భక్తుల కోసం తెరవనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, దేశ సహనం, సహజీవనం శాఖ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్ లోని భారత రాయబారి సంజయ్ సుధీర్ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. అన్ని మతాల ప్రజలకు ఈ ఆలయంలో ప్రవేశముంటుంది. సెప్టెంబర్ 1న దీనిని ప్రారంభించినట్లు దుబాయ్‌కి చెందిన ‘గల్ఫ్ న్యూస్’ పేర్కొంది. ఇది యూఏఈ యొక్క మొదటి కమ్యూనిటీ ఆలయం.
- Advertisement -