Thursday, January 23, 2025

దుబాయ్ ఎయిర్‌పోర్టు రికార్డు..

- Advertisement -
- Advertisement -

దుబాయ్: అంతర్జాతీయ ప్రయాణాలకు కేంద్రబిందువు, ప్రపంచస్థాయి రద్దీ ఎయిర్‌పోర్టు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది 2023లో మొదటి ఆరు నెలల కాలంలో 4 కోట్ల 16 లక్షల మంది ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించారు. అర్థసంవత్సరంలోనే ఇంత మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి వెళ్లడం కీలకం అయింది. కరోనావైరస్ లాక్‌డౌన్ల తరువాతి ఘట్టంలో భారీ స్థాయిలో జరిగిన విమాన ప్రయాణాల దశతో పోలిస్తే ఇప్పుడు నమోదు అయిన సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వైమానికయాన పరిశ్రమకు దుబాయ్ చిరకాలంగా నెంబరు ఒన్‌గా నిలుస్తూ వచ్చింది.

ఈ డిఎక్స్‌బి ఎయిర్‌పోర్టు ఇప్పుడు తిరిగి కోవిడ్ ముందటి ప్రయాణాల స్థాయికి చేరుకుందని వెల్లడించారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా తొమ్మిదో ఏడాదికూడా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు తిరిగి అర్థసంవత్సరపు అతి భారీ రికార్డును దక్కించుకుందని దుబాయ్ ఎయిర్‌పోర్టు సిఇఒ పాల్ గ్రిఫిత్ తెలిపారు. దుబాయ్ గుండా విమానాల రాకపోకలు ఎక్కువగా ఉండటమే కాకుండా, దుబాయ్‌లోని అత్యంత విలాసవంతమైన స్థలాలు, ఆకాశహార్మాలు, ప్రఖ్యాత బుర్జు ఖలీఫా వంటి పర్యాటక స్థలాలు ఈ మార్గాన్ని ఎప్పుడూ రద్దీగా ఉంచుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News