Friday, November 15, 2024

రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన 2 ఏళ్ల బాలుడు

- Advertisement -
- Advertisement -

Dubai Lottery
దుబాయ్: షార్జాలో నివసిస్తున్న రెండేళ్ల భారతీయ బాలుడికి దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం లాటరీ తగలడంతో రాత్రికి రాత్రే ఆ బాలుడు కోటీశ్వరుడైపోయాడు. ఆ బుడ్డోడి పేరు మీద అతడి తల్లిదండ్రులు కొన్న లాటరీ టికెట్ 1 మిలియన్ డాలర్లు(రూ. 7.47 కోట్లు) గెలుచుకుంది. లాటరీ కొన్న మొదటిసారే అది తగలడం మరో విశేషం. వివరాల్లోకి వెళితే, షార్జాలో ఉండే యోగేష్ గోయల్, ధనశ్రీ బండల్ దంపతులకు రెండేళ్ల కశన్ యోగేష్ గోయల్ అనే కుమారుడు ఉన్నాడు. వారు ఇటీవల సెలవులపై ముంబయికి వచ్చారు. కొన్ని రోజు ముంబయిలో గడిపాక తిరిగి షార్జాకు వెళ్లిపోయింది. అయితే వారు సెప్టెంబర్ నెల 25న దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం 371 సిరీస్‌లో 2023 నెంబర్‌తో కుమారుడి పేరుపై ఓ టికెట్ కొన్నారు. యోగేష్ లాటరీ టికెట్ కొనడం ఇదే మొదటిసారి. లాటరీ తగలడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఈ లాటరీ తగలడంతో తమ కుమారుడి భవిష్యత్తు సురక్షితంగా మారిందంటూ ఆ పిల్లాడి తల్లి ధనశ్రీ తెలిపింది. దుబాయ్‌లో మిలీనియం మిలియనీర్ లాటరీ 1999లో ప్రారంభమైంది. అప్పటి నుంచి 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న 184వ భారతీయుడు యోగేష్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News