Monday, December 23, 2024

ఓ సామాన్యుడిలా లండన్ మెట్రోలో దుబాయ్ యువరాజు

- Advertisement -
- Advertisement -

 

Dubai prince in London Metro train

లండన్: దుబాయ్ యువరాజు షేఖ్ హమ్దాన్ బిన్ ముహమ్మద్ అల్ మక్తూమ్ తన కుటుంబం, స్నేహితులతో కలిసి లండన్ లో ఆటవిడుపు గడుపుతున్నారు. ఆయన తన ఆటవిడుపు ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను కూడా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఫోటోల్లో ఆయన లండన్ అండర్ గ్రౌండ్ మెట్రోలో సామాన్యుడిలా ప్రయాణించారు. షేక్ హమ్దాన్ తన స్నేహితుడు అతీజ్‌తో కలిసి నిత్యం రద్దీగా ఉండే లండన్ మెట్రో కంపార్ట్‌మెంట్‌లో సెల్ఫీ తీసుకున్నారు. విశేషమేమిటంటే ఆ రైలులో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు వారు ఎవరన్నది గుర్తించకపోవడం. ప్రస్తుతం దుబాయ్ యువరాజు ఫోటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News