Monday, December 23, 2024

అద్భుతమైన విశేషాలతో దుబాయ్ సమ్మర్ సర్ ప్రైజెస్ 2023

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఫన్, ఎంజాయ్ మెంట్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ కలిగలిపి ఒకేచోట దొరికే ప్లేస్ దుబాయ్ సమ్మర్ సర్ ఫ్రైజెస్. అంతర్జాతీయ స్థాయిలో దుబాయ్ సమ్మర్ సర్ ఫ్రైజెస్ కు ఎంతో పేరుంది. దేశవిదేశాల నుంచి ఈ ఈవెంట్ కు అతిథులు వస్తుంటారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్ (DSS) ఇప్పుడు మరోసారి సిద్ధమైంది. దాదాపు 67 రోజుల పాటు ఈ ఈవెంట్ పర్యాటకులను ఎంటర్ టైన్ చేయనుంది. ఈ ఏడాది డీఎస్ఎస్ 26వ ఎడిషన్. అంటే 26 ఏళ్ల నుంచి ఈ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు. ఈ సమ్మర్ సర్ ఫ్రైజెస్ ను దుబాయ్ ఫెస్టివల్స్ మరియు రిటైల్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DFRE) అందిస్తోంది. జూన్ 29 నుంచి సెప్టెంబర్ 3 వరకు ఈ సమ్మర్ సర్ ఫ్రైజ్ కొనసాగుతుంది. దీని ద్వారా అక్కడే ఉంటున్న స్థానికులకు మరియు విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ లభించనుంది.

మిమ్మల్ని ఎంతగానో ఎంటర్ టైన్ చేసే కన్సర్ట్ లు, ఈవెంట్ లు, అద్భుతమైన అనుభూతులను అనుభవాల కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే డీఎస్ఎస్ వచ్చేస్తుంది కాబట్టి. అన్నింటికి మించి ఈద్ అల అదా పండుగ కూడా ఉంది. జీవితాన్ని మార్చే రాఫెల్‌లు, ఏమాత్రం మిస్ అవ్వలేని రిటైల్ ప్రమోషన్‌లు, విభిన్నమైన గ్యాస్‌ట్రోనమీ ఆప్షన్స్, అలాగే వివిధ హోటళ్లు, కిడ్స్ గో ఉచిత ఆఫర్‌లు సిద్ధంగా ఉన్నాయి. వీటితోపాటు అద్భుతంగా దుబాయ్ అందించే వేడుకల కోసం ఈ సమ్మర్ లో మీరు సిద్ధం కావాల్సిందే. ఇంకా ఎర్లీ బర్డ్ ఆఫర్స్, అనేకమైన ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎక్స్ పీరియన్సెస్ కోసం ప్రసిద్ధమైన మాల్స్ అన్నీ మీ కోసం సిద్ధమైపోయాయి.

ఈద్ అల్ అదా వేడుకల సందర్భంగా కోకాకోలా ఎరీనాలో సంగీత దిగ్గజాలు హుస్సేన్ అల్ జాస్మీ మరియు కడిమ్ అల్ సాహిర్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా డీఎస్ఎస్ ప్రారంభ కచేరీ జులై 1న మొదలవుతుంది. రాత్రి 8 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రదర్శనలు రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ వేసవిని మీ జీవితాంతం గుర్తుంచుకునే విధంగా మార్చుకోండి. ఏఈడీ 150 నుండి ప్లాటినమ్‌ లిస్ట్, దుబాయ్ క్యాలెండర్ మరియు కోకా-కోలా అరేనా సైట్‌లో టిక్కెట్‌లు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి.

మరోవైపు సౌదీ అరేబియా లెజెండ్ మొహమ్మద్ అబ్డో దుబాయ్‌లో ఈద్ అల్ అదా వేడుకలో జూలై 2న సాయంత్రం కోకాకోలా అరేనాలో అద్భుతమైన ప్రదర్శనను అందించనున్నారు. ఈ దిగ్గజ గాయకుడు ఇచ్చే ప్రదర్శనను ప్రత్యక్షంగా చూడటానికి టిక్కెట్‌లను ప్లాటినమ్‌ లిస్ట్‌ లో కొనుగోలు చేయవచ్చు. ధర ఏఈడీ 295 నుండి ప్రారంభమవుతుంది. రాత్రి 8 గంటలకు లోపలకి పంపుతారు. ప్రదర్శన రాత్రి 9.30లకు ప్రారంభం అవుతుంది.

గతేడాది విజయవంతమైన ప్రదర్శన తర్వాత ఇప్పుడు దుబాయ్ మీడియా సిటీలోని ది ఎజెండాలో బీట్ ది హీట్ రెండో ఎడిషన్ కోసం తిరిగి వస్తుంది. డీఎస్ఎస్-స్పాట్ లైట్ మరియు అంఘామి సహకారంతో జూలై, ఆగస్ట్ నెల మొత్తం ప్రదర్శన ఉంటుంది. ఈ అద్భుతమైన వీక్లీ లైవ్ కన్సర్ట్‌ లు విభిన్న సంగీత శైలులలో ప్రసిద్ధ ప్రాంతీయ కళాకారులను ప్రదర్శిస్తాయి. ఈ ప్రతిభావంతులైన కళాకారులలో WEGZ, కైరోకీ, ఆఫ్రోటో, మార్వాన్ పాబ్లో, బాల్టీ, డిస్కో మిస్ర్, ఆటోస్ట్రాడ్, మస్సార్ ఎగ్బారి, షర్మూఫర్స్ ఉన్నారు. పూర్తి లైనప్, టిక్కెట్ విక్రయాలు మరియు ఇతర ఉత్తేజకరమైన ప్రకటనల గురించి రాబోయే అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి.

ఈ ఏడాది డీఎస్ఎస్ ఈవెంట్‌ల పూర్తి క్యాలెండర్ ను జూన్ 20న ఆవిష్కరిస్తారు. ఇది ఈ సమ్మర్ ని ఎలా ఎంజాయ్ చేయాలి అనే దాననిపై సమగ్ర గైడ్‌ను ప్రదర్శిస్తుంది. జూన్ 29 నుండి సెప్టెంబరు 3 వరకు దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజ్‌ల సందర్భంగా నమ్మశక్యం కాని, ఏమాత్రం మిస్ అవ్వలేని రిటైల్ ఆఫర్‌లు, విభిన్న రకాలైన వంటలు, అంతులేని వినోదాలతో నిండిన సమ్మర్ సర్ ప్రైజ్ ఈవెంట్ లో ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. మరింత సమాచారం కోసం, సోషల్ మీడియా ఛానెల్‌లలో @CelebrateDubai మరియు @StyledByDubai మరియు www.DubaiSummerSurprises.comని సందర్శించండి.

దుబాయ్ సమ్మర్ సర్‌ప్రైజెస్‌కు కీలక స్పాన్సర్ గా RAKBANK మాస్టర్ కార్డ్ మరియు వ్యూహాత్మక భాగస్వాములుగా అల్ ఫుట్‌టైమ్ మాల్స్ (దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ & ఫెస్టివల్ ప్లాజా), అల్ సీఫ్, అల్ జరూనీ గ్రూప్ (మెర్కాటో షాపింగ్ మాల్), AW రోస్తమని గ్రూప్, బ్లూవాటర్స్, సిటీవాక్, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్, ఎనోక్, ఎటిసలాత్, మజిద్ అల్ ఫుట్టైమ్ (మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ దీరా), నఖీల్ మాల్స్ (ఇబ్న్ బటుటా మాల్, నఖీల్ మాల్, డ్రాగన్ మార్ట్ 2), ది బీచ్ మరియు ది అవుట్‌లెట్ విలేజ్ వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News