కాంగ్రెస్ దుబ్బాక ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి
చేగుంట: దుబ్బాక నియోజక వర్గం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమని దుబ్బాక కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం రోజు చేగుంట మండలం రాంపూర్ గ్రామంలో చెరుకు మత్యంరెడ్డి ఆశయ సాదన ఆత్మగౌరవ యాత్రలో బాగంగా రాంపూర్ లో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అదికారంలోకి వస్తుందని దుబ్బాకలో తనకు మద్దతు ఇవ్వాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్య, ఉచిత వై ద్యంపై క్షుణ్ణంగా పరిశీలన చేసి అమలు చేయాలని సూచించారు.
Also Read: ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు!
రైతులకు ఎకకాలంలో రుణమాపీ చేస్తామని, పెన్షన్లు పెంచి ఒకే ఇంట్లో ఇద్దరికి ఇస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షల రూపాయలు అందజేస్తామని తెలిపారు. అనంతరం గ్రామ చావిడిలో కాంగ్రెస్ జెండాను చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో మండల సీనియర్ నాయకులు కాశబోయిన శ్రీనివాస్, వడ్ల నవీన్, స్టాలిన్ ( నర్సింలు), అన్నం అం జనేయులు, కొండి శ్రీనివాస్, చాకలి అశోక్,కాశబోయిన మహేష్,కాశబోయిన కిష్టయ్య,యాపర్ల సా యిలు,సిద్దిరాములు,జాంగిర్, చంది మహేష్,సుదర్శనం తదితరులు పాల్గోన్నారు.