Monday, December 23, 2024

దుబ్బాకలో ఎంఎల్‌ఎ రఘనందన్ రావుకు అసమ్మతి సెగ..

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: బిజెపి సీనియర్ నేత, దుబ్బాక ఎంఎల్‌ఎ రఘునందన్ రావుకు అసమ్మతి సెగ తగిలింది. ఆయన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదు మండలాలలోని బిజెపి నేతలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎంఎల్‌ఎ తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి, చేగుంట, దౌల్తాబాద్, తొగుట, దుబ్బాక మండలాలకు చెందిన బిజెపి నేతలు రహస్యంగా మరోసారి భేటీ అయ్యారు.

ఈనెల 2న రఘునందన్ రావుకు వ్యతిరేకంగా తిరుగుబాటు బిజెపి నేతలు సమావేశమయ్యారు. తాజాగా ఆదివారం మిరుదొడ్డిలో సమావేశమయ్యారు. బిజెపి ఎంఎల్‌ఎగా కొనసాగుతోన్న రఘునందన్ రావు వేరే పార్టీకి కోవర్టులా వ్యవహరిస్తునారని వారు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News