Monday, February 24, 2025

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాస మూర్తి శుక్రవారం దుయం చెన్నైలోని తన స్వగృహంలో గుండెపోటుతో కన్నుమూశారు. ప్రముఖ తమిళ నటులు అబిజీత్, విక్రమ్, సూర్య, మోహన్‌లాల్‌తోసహా పులువురు స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పిన శ్రీనివాస మూర్తి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. సూర్య నటించిన సింగం సిరీస్‌లో శ్రీనివాస మూర్తి డబ్బింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన గంభీరమైన స్వరంతో ఆయన తెలుగులో సూర్య పాత్రకు ప్రాణం పోశారు. దాదాపు వెయ్యి చిత్రాలకు ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు. తెలుగు నటుడు రాజశేఖర్‌తోపాటు బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కూడా ఆయన తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

Courtesy by Suman TV

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News