Sunday, December 22, 2024

‘డబుల్ ఇస్మార్ట్’కు డబ్బింగ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఫస్ట్ టైం తెలుగులో ఫుల్ లెంత్ రోల్ పోషిస్తున్నారు. సంజయ్ దత్ తన వాయిస్‌ని అందించడం ద్వా రా అతని క్యారెక్టర్, మూవీకి పవర్ ఇచ్చారు. అతను తన పాత్రకు హిందీలో డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలో మాస్, యాక్షన్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ డోస్ ఉంటుంది.

పూరి కనెక్ట్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News