Wednesday, December 25, 2024

డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్ర సీమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డబ్బింగ్ రచయిత శ్రీరామకృష్ణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. రామకృష్ణ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. 300 చిత్రాలకు పైగా డబ్బింగ్ రచయితగా పనిచేశారు. రజనీకాంత్ కు తెలుగు డబ్బింగ్ చెప్పే గాయకుడు మనోను రామకృష్ణనే పరిచయం చేశాడు. చివరిగా రజనీకాంత్ దర్బార్ సినిమాకు డైలాగ్స్ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News