Thursday, January 23, 2025

బిడ్డారేవంత్ తస్మాత్ జాగ్రత్త:బాలరాజ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ని విమర్శిస్తావా.. బిడ్డారేవంత్ తస్మాత్ జాగ్రత్త అని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ హెచ్చరించారు. మంత్రి తలసానిని దుషిస్తూ అర్ధరహిత పదజాలంతో కూసంస్కారంగా పెండ పిసకే వారి గురించి ఏం మాట్లాడుతానంటూ మాట్లాడినందుకు టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తక్షణమే క్షమాపణ చెప్పాలని దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. మంత్రిని ఉద్దేశించి మాట్లాడటం చాలా బాధాకరమన్నారు. తమ యాదవ్ -కురమలకు పెండ పిసకడం తెలుసు.. నీ రాజకీయ భవిష్యత్ లేకుండా పీక పిసకటం కూడా తెలుసు, అనుచిత వాఖ్యలు చేస్తే బరాబర్ నీ కుతిక పిసకడం కూడా తెలుసు అని డా.దూదిమెట్ల హెచ్చరించారు.

ముఖ్యమంత్రి యాదవ కురుమలను చీకటి బ్రతుకులలో వెలుగులు నింపడం కోసం, ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని, గర్వంగా గౌరవంగా బ్రతకాలని కృషి చేస్తున్నారన్నారు. అలాంటి మా గొల్ల కురుమల ముద్దు బిడ్డ అయిన మంత్రిని దుషించడం అనేది చాలా హీనమైన చర్య అని, వెంటనే బిడ్డ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే, పెద్ద ఎత్తున నీ మీద అందోళనలు చెపడతామని హెచ్చరించారు. మా ఆడబిడ్డలతో నిన్ను చెప్పు చీపురులతో కొట్టిస్తామని, మా యాదవ కురుమల దెబ్బ ఏందొ నీకు చూపిస్తాం అని హెచ్చరించారు. ‘ ఓటుకు నోటు, ఆర్‌టిఐలతో ఇతరులపై బెదిరింపులు చేపట్టే నువ్వు, చిల్లర మల్లర రాజకీయాలు చేయటం అనేది రేవంత్ రెడ్డికి కాంగ్రెసు అద్యక్ష హోదాకు తగదని దూదిమెట్ల హితవు పలికారు.

‘ నిన్ను రానున్న రోజుల్లో ఖచ్చితంగా, మా బహుజన ఓట్లతో నిన్ను రాజకీయ బుస్థాపితం చేయడం ఖాయమని అన్నారు. ‘ యాదవ్ కురుమ సోదరులను విమర్శించే రేవంత్ రెడ్డి వ్యక్తిగతమైన మాటల లేక కాంగ్రెసు మాటల జవాబు చెప్పాలని దూదిమెట్ల డిమాండ్ చేసారు. స్పష్టత ఇవ్వకపోతే జరగబోయే పరిణామాలకు కాంగ్రెసు పార్టీ బాద్యత వహించాలని, రేవంత్ రెడ్డిని ప్రజా క్షేత్రంలో యాదవ్ కురుమలు అడ్డుకోవాలని రాష్ట్ర వ్యాపితంగా దిష్టి బోమ్మల దగ్దానికి పిలుపునిస్తామని దూదిమెట్ల హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News