Saturday, November 16, 2024

చెక్ డ్యామ్ వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది

- Advertisement -
- Advertisement -

మంథని రూరల్: మంథని ప్రాంతంలోని చుట్టు పక్కల గ్రామాలకు వరద నీరు రాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంథని చెక్ డ్యాం నుండి వర్షాలు, వరద నీరు రివర్స్ రావడంతో ఈ ప్రాంతానికి నష్టం జరుగుతుందని చెప్పారు.

అలాగే వరద దాదాపు 1.5 కిలోమీటర్ల వరకు నీరు వెళ్ల అక్కడ ఉన్న ఎల్ మడుగు వద్ద రెండు కొండల మధ్య వెడల్పు తక్కువ ఉండటం వల్ల నీరు అక్కడి రివర్స్ వచ్చి మంథని పట్టణం, ఎక్లాస్‌పూర్, ఖానాపూర్‌లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. మళ్లీ వర్షాలు పడితే నష్టం జరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

ప్రతి సంవత్సర ఈ పరిస్థితులు వస్తున్నందున దీనికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేయాలన్నారు. వరద నీరు పైకి రాకుండా కరకట్ట నిర్మాణం చేసినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.

ఈఈతో మాట్లాడిన ఎమ్మెల్యే బొక్కలవాగు వరద నీరు పట్టణంలోకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అన్నారు. నష్టపోయిన రైతులు, బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మంథని, ఎక్లాస్‌పూర్, ఖానాపూర్, చిన్న ఓదాల, గోపాల్‌పూర్ గ్రామాలను సందర్శించిన ఆయన బాధితుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాలేశ్వరం బ్యాక్ వాటర్‌తో నష్టపోయిన రైతులకు సర్వే చేసి నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News