Sunday, December 22, 2024

దర్జాగా దోపిడీలు..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల కాలంలో పలు నగరాల్లో నకిలీ పోలీసులు, నకిలీ ఐటి, ఇన్‌కంటాక్స్, నకిలీ ట్రాన్స్‌పోర్టు, నకిలీ ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ల అధికారుల పేరుతో చాలా దోపిడీలు జరుగుతున్నాయి. అయితే ఈ దోపిడీలు జరిగిన తరువాత తీరా తాము మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించడం షరామమూలుగా మారింది. అయితే వ్యాపారులు ముందుగా నకిలీ అధికారులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ఎందుకంటే పోలీసుల రంగప్రవేశం చేసి నిందితులను అన్ని విధాలుగా చెటటోర్చి పట్టుకుంటున్నాయి. అయితే అసలు నకిలీ అధికారులను గుర్తించడంలో ఆయా వ్యాపారులు ఎందుకింత ఈజీగా నమ్ముతున్నారంటే వారికి ఆ అధికారులకు ఉండవల్సిన అధికారాలు తెలియకపోవడమే.

దీనిపై వ్యాపార నిర్వాహకులకు పోలీసులు ఒక్కసారిగా కాదు కదా నెలలో కనీసం రెండు, మూడుసార్లు అయినా అవగాహన కల్పిస్తే ఇలాంటి దోపిడీలు జరగటానికి ఆస్కారం ఉండదు. ముఖ్యంగా నిన్న (శనివారం) 28వ తేదీన నగల దుకాణంలో జరిగిన దోపిడీ ఈ కోవలోకే వస్తుంది. ఎందుకంటే నలుగురు వ్యక్తులు తాము ఐటి అధికారులమంటూ బాగానే ఫోజులిచ్చి షాపులోకి చొరబడ్డాడు. వచ్చిరాగానే షాపులోని బిల్లులు ఎడాపెడా చూశారు.అయితే ఆ సమయంలో షాపు యజమాని లేకపోవటం ఉన్న వారికి కూడా సరైన అవగాహన లేకపోవటం వారు నిజమైన ఐటి అధికారులేనని నమ్మారు. అయితే వచ్చిన నకిలీ అధికారులు ఈ ఆభరణాల్లో కొన్నింటికీ సరైన ఆధారాలు లేవని సుమారు. 1.700 గ్రాముల బంగారు ఆభణాలను ఎత్తుకెళ్లారు.

తీరా వారు వెళ్లిన తరువాత షాపులోని వారు వారికి తెలిసిన వారిని ఐటి అధికారుల వచ్చి మా ఆభరణాలు తీసుకెళ్లారని చెప్పగానే అవతలి వారు ఐటి అధికారులు ఎప్పుడూ ఆభరణాలు తీసుకెళ్లరని, వారు నోటీసులు మాత్రమే ఇస్తారని చెప్పడంతో షాపు యజమానులు షాక్‌లోకి జారుకున్నారు. ఇదంతా ఒక్క సంఘటనతో ఆగిపోవటం లేదు. పలు ప్రభుత్వ సంస్థలకు చెందిన ఉద్యోగుల మంటూ చాలా చోట్ల దోపిడీలకు పాల్పడుతున్నారు. వ్యాపారులు కూడా తాము చేస్తున్న పనిలో ఏదో లోపం ఉందని వారిని నమ్మి అంతోఇంతో సమర్పించుకుంటున్నారు. కానీ అసలు వచ్చింది అసలా, నకిలీనా అని ఆలోచిండమే మానేస్తున్నారు. దీంతో వచ్చిన వారు తమ పనిని ఈజీగా కానిచ్చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పలు వ్యాపార సంస్థల నిర్వాహకులకు అధికారులకు ఉండవల్సిన అధికారుల గురించి అవగాహన కల్పిస్తే ఇలాంటి దోపిడీలు చాలా వరకు ఆగిపోయే ఆస్కారం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News