Friday, December 20, 2024

వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్ : ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… యాదాద్రి జిల్లా ,దాతార్ పల్లి గ్రామానికి చెందిన కొమ్మరాజు కళ్యాణి (24) తల నొప్పిగా ఉందని సోమవారం పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని అపెక్స్ హాస్పిటల్ లో చేర్పించారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి అనంతరం ఆపరేషన్ చేస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బాగానే ఉందని చెప్పి ఇప్పుడు మృతి చెందిదని నీలదీయడంతో తలలో సమస్య వచ్చిందని ఆపరేషన్ అవసరమై చేస్తుండగా గుండెపోటు కు గురైందని వైద్యులు పొంతునలేని సమాధానాలు చెప్పడంతో తన భార్య మృతికి వైద్యుల నిర్లక్షమే కారణమని బందువులు ,కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కాగా మృతురాలికి రెండు సంవత్సరాల అమ్మాయి,ఆరు నెలల బాబు ఉన్నారు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News