Wednesday, January 22, 2025

అకాలవర్షాలతో గోధుమ పంటకు గండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఇప్పటి అకాల వర్షాలతో దేశంలో గోధుమ పంట ఉత్పత్తి తగ్గుతుంది. ఈసారి పంటకాలంలో గోధుమ ఉత్పత్తి మొత్తం మీద 102.8 మిలియన్ టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఎండాకాలంలో భారీ వర్షాలు గోధుమ చేతికందివచ్చే దశలో పిడుగుపాటు అయింది. మార్చిలో దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు, ఈదురుగాలుల అసాధారణ పరిణామం ఏరపడింది. దీనితో తీవ్రస్థాయిలో పంటనష్టం వాటిల్లింది.

అగ్రివాచ్ విశ్లేషణల ప్రకారం ఈ విషయం వెల్లడైంది. ఈసారి గోధుమ పంట దిగుబడి 104.2 ఎంటిలు వరకూ ఉంటుందని సంస్థ మార్చి 9వ తేదీన అంచనా వేసింది. అయితే అకాలవర్షాలతో దిగుబడి తగ్గుతుందని వెల్లడైంది. ఇప్పటికీ పలు ప్రాంతాలలో గోధుమలు, గోధుమ పిండి ధరలు ఎక్కువగా స్థిరంగా ఉంటూ వస్తున్నాయి. దిగుబడి తగ్గే వీలుండటంతో ఈ ధరలు మరింతగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే గత ఏడాది ఇదే సీజన్‌లో పంట దిగుబడి 97.6 ఎంటిలతో పోలిస్తే ఇప్పటి పరిస్థితి మెరుగ్గానే ఉంది. భారీ వర్షాలతో మధ్యప్రదేశ్‌లో 38 జిల్లాలు, యుపిలో పది , హర్యానా, పంజాబ్‌ల్లో 21 జిల్లాల్లో పంటదెబ్బతింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News