Monday, December 23, 2024

పిడుగు పాటుతో దుక్కిటెద్దు మృత్యువాత

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: పిడుగు పాటుతో దుక్కిటెద్దు మృత్యువాత చెందిన సంఘటన నల్లబెల్లి మండలంలోని నందిగామ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. డూకెర మల్లయ్య అనే రైతు తన వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు ఎడ్లబండిపై వెళ్లి తిరిగి వస్తుండగా నందిగామ గ్రామ సమీపానికి చేరుకునే సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగు పడటంతో దుక్కిటెద్దు మృతిచెందగా మరో దుక్కిటెద్దు భయంతో పరుగులు తీసింది. కాగా రైతు మల్లయ్య పిడుగు పాటుకు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ములుగులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దుక్కిటెద్దు విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News