Thursday, April 3, 2025

8 నుంచి దులీప్ ట్రోఫీ

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశవాళీ క్రికెట్‌లోని ముఖ్య టోర్నీల్లో ఒకటిగా పరిగణించే దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 8 నుంచి 25 వరకు జరుగనుంది. ఈ టోర్నీకి తమిళనాడు క్రికెట్ సంఘం ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ మ్యాచ్‌లు చెన్నైలో జరుగనున్నాయి. ఇక ఫైనల్ సమరానికి కొయంబత్తూర్ నగరం వేదికగా నిలువనుంది. ఫైనల్ సెప్టెంబర్ 21 నుంచి జరుగనుంది. ఈసారి దులీప్ ట్రోఫీలో ఆరు జట్లు పోటీ పడనున్నాయి. కొత్తగా నార్త్ ఈస్ట్ జట్టు ఈసారి బరిలోకి దిగనుంది. కరోనా కారణంగా మూడేళ్లుగా దులీప్ ట్రోఫీని నిర్వహించలేదు. కిందటిసారి 2019లో దులీప్ ట్రోఫీని నిర్వహించారు. కాగా ఈ ఏడాది పరిస్థితులు అనుకూలంగా మారడంతో దులీప్ ట్రోఫీతో ఇరానీ ట్రోఫీని కూడా నిర్వహించనున్నారు. రంజీ చాంపియన్ మధ్యప్రదేశ్‌రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య ఈ పోరు జరుగనుంది. అక్టోబర్‌లో ఈ టోర్నీని నిర్వహిస్తారు.

Duleep Trophy 2022 Starts on Sep 8

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News