Monday, December 23, 2024

దులీప్‌ ట్రోఫీ 2024: సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌

- Advertisement -
- Advertisement -

దులీప్‌ ట్రోఫీలో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ ఇషాన్ కిష‌న్ సెంచరీతో కదం తొక్కాడు. ఇండియా-సి తరుపున ఆడుతున్న ఇషాన్..అనంతపురం వేదికగా ఇండియా–బితో జరుగుతున్న మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఇండియా-సీ జట్టు మొదట బ్యాటింగ్ చేపట్టింది. అయితే ఇన్నింస్ ప్రారంభమైన కాసేపట్టికే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు.

రజత్ పటిదార్ (40), మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (4)లు పర్వాలేదనిపించారు. వీరి తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. 120 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 102 పరుగులు చేశాడు. ఇషాన్ తోపాటు ఇంద్రజిత్ (62) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం ఇండియా-సీ 64 ఓవర్లకు 272/2 స్కోరు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News