Thursday, September 19, 2024

దులీప్ ట్రోఫీ జట్ల ఎంపిక

- Advertisement -
- Advertisement -

కెప్టెన్‌లుగా శుభ్‌మన్, అయ్యర్, రుతురాజ్
సీనియర్లు రోహిత్, బుమ్రా, కోహ్లిలకు విశ్రాంతి
ముంబై: దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టోర్నమెంట్‌గా పేరున్న దులీప్ ట్రోఫీ టోర్నీ కోసం భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) జట్లను ప్రకటించింది. సెప్టెంబర్ ఐదు నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బిసిసిఐ బుధవారం ఖరారు చేసింది.

టిమ్‌ఎకు శుభ్‌మన్ గిల్, టీమ్‌బికు అభిమన్యు ఈశ్వరన్, టీమ్‌సికు రుతురాజ్ గైక్వాడ్, టిడికి శ్రేయస్ అయ్యర్‌లను సారథులుగా ఎంపిక చేశారు. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను తొలి రౌండ్ మ్యాచ్‌లకు ఎంపిక చేయలేదు. అంతేగాక జస్‌ప్రిత్ బుమ్రా, రింకు సింగ్, రవిచంద్రన్ అశ్విన్, రింకు సింగ్‌లకు కూడా దులీప్ ట్రోఫీ జట్లలో చోటు దక్కలేదు. ఇక స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్ దులీప్ ట్రోఫీతో మళ్లీ క్రికెట్‌కు శ్రీకారం చుట్టనున్నాడు.

కాగా, దులీప్ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లకు బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ టీమ్‌లో చోటు లభిస్తే వారి స్థానంలో ఇతర క్రికెటర్లకు అవకాశం కల్పిస్తారు. మరోవైపు ఫిట్‌నెస్ సాధిస్తే తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడిక్డి కూడా దులీప్ ట్రోఫీలో అవకాశం కల్పించనున్నారు. ఇదిలావుంటే దేశవాళీ టోర్నీల్లో దులీప్ ట్రోఫీది ప్రత్యేక స్థానం. ఈ టోర్నీ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. భారత క్రికెట్ బోర్డు కూడా దేశవాళీ క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. టీమిండియాలో చోటు సాధించాలంటే ప్రతి క్రికెటర్ డొమెస్టిక్ క్రికెట్ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఇప్పటికే స్పష్టం చేసింది.

మొదటి రౌండ్ మ్యాచ్‌లలో పాల్గొనే జట్ల వివరాలు
టీమ్ ఎ: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కెఎల్ రాహుల్, తిలక్‌వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్ర, ఎస్.రావత్.

టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహ్మద్‌సి సిరాజ్, యశ్ దయాల్, ముకేశ్ కుమార్, నారాయణ్ జగదీశన్, సాయి కిశోర్, మోహిత్ అవస్తి, రాహుల్ చాహర్.

టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పొరెల్, సూర్యకుమార్ యాదవ్, ఇంద్రజిత్, హృతిత్ షోకిన్, మానవ్ సుతార్, ఆర్యన్ జుయల్, మయాంక్ మర్కండే, హిమాన్షు చౌహన్, విజయ్ కుమార్, సందీప్ వారియర్, అన్షుల్ ఖంబోజ్, ఉమ్రాన్ మాలిక్.

టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథ్వర్వ తైడే, యశ్ దూబె, దేవ్‌దుత్ పడిక్కల్, ఇషాన్ కిషన్, రికి భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ఆతిథ్య థాకరే, హర్షిత్ రాణా, సౌరభ్ కుమార్, కెఎస్ భరత్, ఆకాశ్ సేన్ గుప్తా, తుషార్ దేశ్ పాండే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News