Sunday, December 22, 2024

‘కింగ్ ఆఫ్ కోథా’ క్యారెక్టర్స్ విడుదల..

- Advertisement -
- Advertisement -

దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్ ఆఫ్ కోథా’. ఈ సినిమాను జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలోని క్యారెక్టర్స్ కు సంబంధించిన వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అభిమానులతోపాటు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమాపై ఈ వీడియో భారీ అంచనాలు పెంచేసింది.

ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ తో పాటు డ్యాన్సింగ్ రోజ్, ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్, శాంతి కృష్ణ, వడ చెన్నై శరణ్, అనిఖా సురేంద్రన్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. అభిలాష్ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. షాన్ రెహమాన్, జేక్స్ బిజోయ్ సంగీతం సమకూర్చారు. జూన్ 28న టీజర్‌ను విడుదల చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News