Friday, November 22, 2024

చాలా అరుదైన కథ ఇది

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ’సీతారామం’. రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఈనెల 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపధ్యంలో హీరో దుల్కర్ సల్మాన్ మీడియాతో మాట్లాడుతూ.. “సీతారామం… చాలా ఒరిజినల్ కథ. క్లాసిక్ మూవీ. చాలా అరుదైన కథ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. స్క్రీన్‌ప్లే నాకు చాలా నచ్చింది. ఊహాతీతంగా వుంటుంది. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. ‘సీతారామం’ అద్భుతాన్ని వెండితెరపై చూడాల్సిందే. ఈ సినిమా కోసం విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. కథ విన్నప్పుడు సినిమాలో సంగీతం బావుంటుందని తెలుసు. కానున్న కళ్యాణం పాట కాశ్మీర్ లో షూట్ చేస్తున్నప్పుడే మ్యాజికల్ గా వుంటుందని అర్ధమైంది. పాటలన్నీ విజువల్ వండర్‌లా వుంటాయి. ఒక పాటకు మించి మరో పాట ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా అద్భుతంగా వుంటుంది. కానున్న కళ్యాణం పాట నా ఫేవరేట్. తెలుగు అద్భుతమైన భాష. పాటల్లో ప్రతి వాక్యం, భావం తెలుసుకున్నాను.

ఈ సినిమాలో రామ్ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తా. అతను ఒక అనాధ. రామ్‌కి దేనిపైనా ద్వేషం వుండదు. అతనికి దేశభక్తి ఎక్కువ. ఒక క్లాసిక్ నవల చదువుతున్నప్పుడు కొన్ని పాత్రలను ఇలా ఉంటాయేమోనని ఊహించుకుంటాము. ’సీతారామం’ కథ విన్నప్పుడు సీత పాత్రని కూడా అలానే ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చేసరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్‌లో మృణాల్‌ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. చాలా అద్భుతంగా చేసింది. ఇందులో కొత్త రష్మికని చూస్తారు. ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని ఆమె చేయలేదు. ఇక నాకు దర్శకత్వం చేయాలని వుంది. కానీ ఇప్పుడంత సమయం లేదు. నా దర్శకత్వంలో సినిమా వస్తే మాత్రం అది ప్రేక్షకుల ఊహకు భిన్నంగా వుంటుంది” అని అన్నారు.

Dulquer Salmaan interact with media about ‘Sita Ramam’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News