Wednesday, January 22, 2025

అద్భుతమైన దృశ్య కావ్యం

- Advertisement -
- Advertisement -

Dulquer Salmaan speech at Visakha Theeram Lo 'SitaRamam'

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకంగా చిత్రం ‘సీతారామం’. రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ‘సీతారామం’ ఈనెల 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ‘విశాఖ తీరంలో సీతారామం’ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, సుమంత్, తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్ వేదికపై ఇంతందం… పాట పాడి అభిమానులని అలరించారు. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “సీతారామం… అద్భుతమైన దృశ్య కావ్యం. ఈనెల 5న వస్తున్న ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలి” అని కోరారు.

Dulquer Salmaan speech at Visakha Theeram Lo ‘SitaRamam’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News