Sunday, December 22, 2024

‘కింగ్ ఆఫ్ కోత‌’ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

దుల్కర్ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టు ‘కింగ్ ఆఫ్ కోత‌’. గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో డైరెక్టర్ అభిలాష్‌ జోషి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఇప్ప‌టికే విడుదైల సాంగ్, టీజ‌ర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

వేఫరెర్‌ ఫిలిమ్స్-జీ స్టూడియోస్‌ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను పాన్ ఇడియా స్థాయిలో నిర్మిస్తున్నారు. షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇక, వచ్చే ఏడాది ఓనమ్‌ పండుగ కానుకగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సినిమా విడుదల కానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News