Monday, January 20, 2025

డుం డుం… మోగింది మేళం

- Advertisement -
- Advertisement -

Dum Dum Lyrical Song Out from 'Swathi Muthyam'

గణేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ’స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పెళ్లి నేపధ్యంలోని గీతం విడుదలైంది. కథానాయకుడు గణేష్, నాయిక వర్ష బొల్లమ్మతో పాటు రావు రమేష్, నరేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రగతి, సురేఖా వాణి తదితరులు ఈ వీడియో చిత్రంలో కనిపిస్తారు.ఈ గీతానికి సాహిత్యాన్ని కెకె అందించగా, మహతి స్వరసాగర్ సంగీతంలో హుషారుగా సాగుతుంది ఈ గీతం. ఈశ్వర్ పెంటి మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తుంది. ‘డుం డుం డుం డుం డుం మోగింది మేళం..’ అంటూ మొదలయ్యే ఈ పాట సందర్భాన్ని దర్శకుడు లక్ష్మణ్ వివరించగానే, మహతి స్వరసాగర్ చాలా అద్భుతమైన మెలోడీ బాణీని స్వర పరిచారు. ఇది కథానాయకుడు, నాయికలకి నిశ్చితార్థం జరిగే సందర్భంలో సాగే పాట. దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. “చిత్ర కథాంశం ప్రకారం నాయక, నాయికల పెళ్లి గీతం ఇది. వీరి నిశ్చితార్థం నుంచి పెళ్లి వరకూ జరిగే వివిధ వ్యవహారాలు, సందర్భాలు, సన్నివేశాల సమాహారం ఈ పాట”అని అన్నారు. దసరా శుభాకాంక్షలతో ‘స్వాతిముత్యం’ను అక్టోబర్ 5న విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

Dum Dum Lyrical Song Out from ‘Swathi Muthyam’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News