Tuesday, January 14, 2025

మూగ బాలికపై సామూహిక అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్: మూగ మైనర్ బాలికపై గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచార యత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ కాలనీలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వీధి ప్రజలు తెలిపిన మేరకు మధ్యరాత్రి సమయంలో తన 15 ఏళ్ల మూగ కూతురు కనిపించక పోయేసరికి కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. స్థానికుల సహకారంతో 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. కాగా పోలీసులు వచ్చేసరికి ఓ పాడుబడ్డ హాస్టల్ భవనం నుంచి తమ కూతురు పరిగెత్తుకుంటూ వచ్చిందని తెలిపారు.

మైనర్ బాలికపై దుండగులు అఘాయిత్యం చేసిన తీరును తన మూగ సైగలతో వివరించింది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక ఎస్సై విజయ్ కుమార్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఇదిలా ఉండగా బాధితులు మాత్రం 100కు ఫిర్యాదు చేశామని, పోలీసులు వచ్చి వెళ్లారని చెబుతున్నారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి మూగ బాలికపై అఘాయిత్యం జరిగి ఉంటే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News