Thursday, January 23, 2025

పారపట్టి గుంతలు పూడ్చి..

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అధికారులకు చురక

మహ బూబాబాద్: రోడ్డుపై ఏ ర్పడ్డ గుంతలను పూడ్చేందుకు ముందుకు రాని అధికారులకు చురకలు వేశారు.. రోడ్డుపై వె ళ్తుంటే కనిపించిన గుంతలతో వా హనదారులు పడుతున్న ఇబ్బందులు గమనించారు.. వెంటనే స్ప ందించి తానే దిగి వెంటనే అక్కడి కి అప్పటికప్పుడు మోరం, రెడ్ మిక్స్ తెప్పించి స్వయంగా గుంతలను పూడ్చి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఇలాంటి చిన్న చిన్న ప నులు కూడా చేసేందుకు అధికారులు ఉపక్రమిచకపోతే ఎలా అంటే తానే స్వయంగా రంగంలోకి దిగి వారికి చురకలు వేశారు.

గురువారం మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వా ర్డు పరిధిలోని గాంధీపురం వెళ్లి తిరిగివస్తూ రోడ్డుపై గమనించిన గుంతలను చూసి తన వా హనాన్ని ఆపి పూడ్చి వేశారు. ఇది తాత్కాలికమే అని ఇలా ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అధికారులు తక్షణమే స్పందిస్తే వాహనచోదకులకు ఎలాంటి అసౌకర్యం కలుగదంటూ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. శాశ్వతంగా గుంతలు పూడ్చే ప్రక్రియ చేపట్టాలని వారికి సూచనలు చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ వైస్ చైర్మైన్ ఎండి.ఫరీద్, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి,మార్నేని వెంకన్న,యాళ్ల మురళీధర్‌రెడ్డి,కొండ్ర ఎల్లయ్య,తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News