Sunday, December 22, 2024

దుండిగల్ లో పూలే విగ్రహాన్ని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ పియస్ పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. దుండిగల్ నుంచి నాగళూరు వెళ్లే దారిలో కారు అతివేగంగా దుసుకొచ్చి పూలే విగ్రహాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహీంద్రా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరొకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News