Sunday, December 22, 2024

దుండిగల్ విద్యుత్ ప్లాంటు సిద్దం

- Advertisement -
- Advertisement -

14.5 మెగా వాట్ల ఉత్పతి సామర్ధం
త్వరలో ప్రారంభిస్తాం కమిషనర్ రోనాల్డ్ రోస్

మన తెలంగాణ /సిటీ బ్యూరో: గ్రేటర్ వాసులకు స్వచ్ఛమైన గాలి,ఆరోగ్యవంతమైన జీవనాన్ని అందించడమే లక్షంగా జిహెచ్‌ఎంసి విశేష కృషి చేస్తోంది. ఇందుకు పర్యావరణ పరిరక్షణ దోహదం చేసే అనేక కార్యక్రమాలను చేపట్టడం ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకే హైదరాబాద్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతుంది. తెలంగాణకు హరితహారం ద్వారా హైదరాబాద్ మహా నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడమే కాకుండా కోటి మందికి పైగా జనాభా ఉన్న ఈ నగరంలో ఉత్పతి అవుతున్న వివిధ వ్యర్థాలను శాస్త్రీయ విధానంలో సమవర్థవంతంగా నిర్వహించడం ద్వారా వాయు, జల, పరిసరాల కాలుష్యాన్ని పూర్తిగా నివారించడంలో సఫలీకృతమవుతోంది.

సమగ్ర మున్సిపల్ ఘన పదార్ధాల నిర్వహణ ప్రాజెక్టు(ఐఎంఎస్‌డబ్లూఎం) ద్వారా ఘన వ్యర్థాలు (చెత్త ఈ వేస్ట్) ద్వారా విద్యుత్, ఎరువులు, భవన నిర్మాణ వ్యర్థాల ద్వారా పునర్ ఉత్పత్తిలను సృష్టించి సహాజ వనరులకు పరిరక్షణకు బాటలు వే స్తోంది. అంతేకాకుండా వ్యర్థ జలాలను శుద్దీకరించి వాటిని పునర్ వినియోగంచడం ద్వారా ఎంతో విలువైన నీటిని పోదుపుకు మార్గం సుగమం చేస్తోంది. తద్వారా వ్యర్థాల నుంచి సంపదను సృష్టించి దానిని ప్రజా సంక్షేమానికి వినియోగిస్తోంది. ఈ క్రమంలోనే చెత్తతో పాటు ఈ వెస్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి గాను దుండిగల్‌లో మరో ప్రాజెక్టును త్వరలో అందుబాటులోకి తీసుకు వస్తోంది.

14.5 మెగావాట్ల సామర్థంతో దుండిగల్ విద్యుత్ ప్లాంట్ సిద్దం:

వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పతికి గాను దుండిగల్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్లాంట్ ద్వారా రోజువారిగా 14.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్షంగా దీనిని నెలకొల్పారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు గాను ట్రీట్మెంట్ స్టోరెజ్ డిస్పోజల్ ఫెసిలిటీ సంబంధించి భూమిలో ఏర్పాటు చేశారు. 14.5 మెగావాట్ల సామర్థ్యం తో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సుమారు 800 టి.పి.డి ఆర్.డి.ఎఫ్ వినియోగించనున్నారు. ఈ ప్లాంట్‌కు కావాల్సిన వ్యర్థాలను దుండిగల్ పరసర పట్టణ ప్రాంతాలు, జిహెచ్‌ఎంసి పరిధిలో గల ప్లాంట్‌కు సమీప ప్రాంతాల నుంచి వ్యర్థాలను తరలించనున్నారు. తద్వారా జవహర్ నగర్ డంపింగ్‌యార్డుపై కొద్దిగా భారం తగ్గే అవకాశం ఉంది. 14.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి గాను రోజుకు 1000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు అవసరం ఉంటుంది.

దుండిగల్ విద్యుత్ ప్లాంట్‌ను పరిశీలించిన జిహెచ్‌ఎంసి కమిషనర్

దుండిగల్ 14.5 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను శుక్రవారం జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ ఈ.పి.టి.ఆర్.ఐ డైరెక్టర్ జనరల్ వాణి ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో ఈ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్లాంట్‌లో ప్రధాన యూనిట్లైన ర్యాంపు, ఆర్ డి ఎఫ్ టైపింగ్ హాల్ పిట్ ట్బన్ జనరేటర్, మాస్టర్ కంట్రోల్ రూం బాయిలర్, బూడిద పిట్ ఎఫ్ సి జి ఎస్ చిమ్నీ, ఏ సి సి, స్విచ్ యార్డ్ యూనిట్ లను పరిశీలించారు.

వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు అన్ని అనుమతులు వచ్చిన నేపథ్యంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేయాలని అధికారులకు సూచించారు. స్టిచ్చింగ్ స్టేషన్, కంట్రోల్ రూమ్ పనులు పూర్తయిన నేపథ్యంలో ప్లాంట్ ను ఛార్జ్ చేసేందుకు ట్రాన్స్మిషన్ లైన్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులతో పాటు సంబంధిత ఏజెన్సీనీ కమిషనర్ ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్.డబ్ల్యూ ఎంఎస్ సి కోటేశ్వర రావు, అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ఈ ఈ శ్రీనివాస్ రెడ్డి, రీల్ (రాంకీ) డైరెక్టర్ వి.ఎస్ వెంకటేశన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శాస్త్రి, తోట కృష్ణారావు, (హెచ్‌ఐఎంఎస్‌డబ్లూఎల్) లిమిటెడ్ ప్రాజెక్ట్ హెడ్, బి జి జి హెడ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News