Friday, December 27, 2024

అదరగొడుతున్న డంకీ ట్రైలర్

- Advertisement -
- Advertisement -

హ్యాట్రిక్ కొట్టేందుకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రెడీ అవుతున్నాడు. పఠాన్, జవాన్ లతో బాలీవుడ్ ను షేక్ చేసిన షారుఖ్, డంకీతో హ్యాట్రిక్ ను అందుకుంటాడని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగే రహో మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజూ వంటి భారీ సూపర్ హిట్లు ఇచ్చిన రాజ్ కుమార్ హీరానీ దర్శకత్వంలో రూపొందడంతో డంకీపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ప్రభాస్ సినిమా సలార్ కు డంకీ పోటీగా వస్తున్నా తగ్గేదేలే అంటోంది డంకీ యూనిట్. అక్రమ వలసల నేపథ్యంలో డంకీ రూపొందడం విశేషం. కథ కాస్త సీరియస్ గా ఉండే అవకాశాలున్నా, కామెడీ విషయంలో రాజ్ కుమార్ హీరానీ ఏమాత్రం తగ్గలేదట. తాజాగా రిలీజైన డంకీ ట్రైలర్ లో కూడా కామెడీకే పెద్దపీట వేశారు. ఈ ట్రైలర్ బాలీవుడ్ బాద్ షా అభిమానుల్ని ఉర్రూతలూగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News