Monday, December 23, 2024

‘డంకీ’ భారీ వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న షారూక్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ సహా ఇతర నటీనటుల అద్భుతమైన పెర్ఫామెన్స్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని టేకింగ్‌తో రూపొందిన భారి చిత్రం ‘డంకీ’.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల హృదయాలను దోచుకుంది. అందరికీ సినిమా కనెక్ట్ కావటంతో బాక్సాఫీస్ దగ్గర సినిమా సత్తా చాటుతోంది.

డంకీ సినిమాకు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. దీంతో కలెక్షన్స్ దుమ్ముదులుపుతున్నాయి. దీంతో సినిమా ఇండియాలో రూ.150 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా ఒకే ఒక భాషలోనే ఈ వసూళ్లు రావటం విశేషం.

‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించారు. బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ సహా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నారు. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లుగా వ‌ర్క్ చేశారు.డిసెంబర్ 21న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ఆదరాభిమానాలను అందుకుంటూ దూసుకెళ్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News