Saturday, December 21, 2024

నగరంలో దేవి దుర్గ ప్రతిమ పాక్షికంగా ధ్వంసం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేవి నవరాత్రులు నిర్విగ్నంగా కొనసాగుతున్నాయి. అయితే హైదరాబాద్ లోని నాంపల్లి మండపంలో పెట్టిన దుర్గమ్మ ప్రతిమ పాక్షికంగా విధ్వంసం అయింది. ఆకతాయిలు శుక్రవారం ప్రతిమను ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆబిడ్స్ అసిస్టెన్స్ పోలీస్ కమిషనర్ ఏ.చంద్ర శేఖర్ ప్రకారం గుర్తు తెలియని ఆకతాయిలు దుర్గమ్మ ప్రతిమను ధ్వంసం చేశారు. అది కూడా తెల్లవారు జామున.  కాగా ప్రతిమను పున:స్థాపించారు. తర్వాత పూజలు కొనసాగాయి.

‘‘సిసిటివి ఫుటేజ్ పరిశీలిస్తున్నాము. దర్యాప్తు ఆరంభించాము’’అని పోలీసు అధికారొకరు తెలిపారు. ఇదిలా ఉండగా బిజెపి నాయకురాలు మాధవి లత మండపంను సందర్శించారు. ‘‘గత కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి. ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదు’’ అని ఆమె హెచ్చరించారు. కాగా బేగం బజార్ పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News