హైదరాబాద్: విజయ దశమి పర్వదినం వేడుకలు నగర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రతి ఇళ్లు బంధు మిత్రులతో కళకళాలాడాయి. నూతన వస్త్రాలు ధరించి చిన్నారులు మురిసి పోయ్యారు. పండుగ సందర్భంగా తెల్లవారు జామునే మంగళ స్నానాలు ఆచరించి అమ్మవారు ఆలయాలకు భక్తులు పోటేత్తారు. తమ ఇష్టా దైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పిండి వంటలు ప్రత్యేక విందు చేసుకున్నారు. గత ఏడాది కోవిడ్ కారణంగా పండుగ పూట ఇళ్లకే పరిమితమైన నగరవాసులు ఈ సంవత్సరం సాయంత్రం వేళా సంప్రదాయ బద్దంగా జమ్మి చెట్టు వద్దకు వెళ్లి అక్కడ పూజలు నిర్వహించారు. అనంతరం ఒక్కరి ఒక్కరు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర వ్యాప్తంగా రావణ దహనాలు నిర్వహించారు. శరన్నవరాత్రోత్సవాలల్లో మండపాలల్లో అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. విజయ దశమి పురస్కరించుకుని నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కనుల పండువగా జరిగిన విజయ దశమి వేడుకలలో నగర వాసులు పాల్గొన్నారు.
ట్యాంక్‌బండ్‌లో అమ్మవారి నిమజ్జనం
శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న దుర్గమాత శుక్రవారంం భారీ ఊరేగింపుల మధ్య నిమజ్జనం అయ్యారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని డప్పు చప్పులు, భజన కీర్తనల మధ్య సోమవారం నిమజ్జనానికి తరలించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో అమ్మవారి శోభయాత్ర కనుల పండువగా జరిగింది. దీంతో ఆదివారం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్‌ల ద్వారా అమ్మవారిని నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.