- Advertisement -
హైదరాబాద్: మాదాపూర్‌లో నిద్రమాత్రలు మింగి శేజల్ ఆత్మహత్యాయత్నం చేసింది. హైదరాబాద్‌లోని పెద్దమ్మ దేవాలయం వద్ద రోడ్డుపై శేజల్ పడిపోయింది. శేజల్ బ్యాగ్‌లో నిద్రమాత్రలను పోలీసులు గుర్తించారు. పోలీసులు శేజల్‌ను ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం ఆమె ఢిల్లీలోనూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గతంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసింది. గత ఆరునెలలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాని సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ప్రభుత్వ పెద్దలు న్యాయం చేస్తామని చెప్పి మాటతప్పారని వివరించింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నానని చెప్పింది.
Also Read: సార్ సాయిని పిలువండి. లెమనండి… మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్
- Advertisement -