Saturday, March 29, 2025

ఆరు వారాల్లో దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ పరిధి నిర్ధారించాలి: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ నిర్ధరణ శాస్త్రీయంగా జరగలేదని పిటిషన్లు వేశారు. ఎఫ్‌టిఎల్ నిర్ధరణపై దాఖలైన పిటిషన్లను సిజె ధర్మాసనం విచారించింది. ఎఫ్‌టిఎల్‌పై అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని జిహెచ్ఎంసికి హైకోర్టు ఆదేశించింది. వారంలోపు చెరువుల పరిరక్షణ కమిటీకి బాధితులు అభ్యంతారాలు తెలపాలని సూచించింది. అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్న తరువాత ఆరు వారాల్లో ఎఫ్‌టిఎల్ పరిధి నిర్ధారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోపు కూల్చివేతలు చేపట్టబోమని కోర్టుకు జిహెచ్‌ఎంసి తెలిపింది. రికార్డుల ప్రకారం దుర్గం చెరువు ఎఫ్‌టిఎల్ పరిధిలో 65 ఎకరాలే ఉందని పిటిషనర్లు పేర్కొన్నారు. దుర్గం చెరువులో ఎఫ్‌టిఎల్ పరిధి 160 ఎకరాలు అధికారులు చెప్పడం సరికాదని పిటిషనర్లు వాపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News