Friday, January 10, 2025

విశాఖపట్నంలో మొదటి స్టోర్‌ను ప్రారంభించిన డ్యురియన్‌ ఫర్నిచర్

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో అత్యంత విశ్వసనీయ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డ్యురియన్‌ ఫర్నిచర్ 26 ఆగస్టు 2023న విశాఖపట్నంలో స్టోర్‌ను ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి మొదటి స్టోర్. అత్యాధునిక గృహాలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి రూపొందించిన అధిక-నాణ్యత జీవనశైలి ఫర్నిచర్ పీస్ లను ఇది ప్రదర్శిస్తుంది. ఈ స్టోర్ రైల్వే డిఆర్ఎమ్ ఆఫీసు ఎదురుగా దొండపర్తి వద్ద ఒక ప్రధానమైన ప్రాంతంలో ఉంది. ఈ విశాలమైన 7000 చదరపు అడుగుల ఫ్రాంచైజీ స్టోర్ ను శ్రీ హరి ప్రసాద్ కొంచాడ నిర్వహిస్తున్నారు. నాణ్యత, మన్నిక పట్ల పూర్తి నిబద్ధతను డ్యురియన్‌ ఫర్నిచర్ కలిగి ఉంది. ప్రతి ఫర్నిచర్ పీస్ సుదీర్ఘకాల పనితీరు, అత్యున్నత ఆకర్షణను నిర్ధారించడానికి పూర్తి నైపుణ్యంగా రూపొందించబడింది. ఖచ్చితమైన పనితనం పట్ల బ్రాండ్ యొక్క ప్రాధాన్యత దానిని విభిన్నంగా ఉంచుతుంది, ఇది కాలపరీక్షకు నిలబడే ఫర్నిచర్ కోసం వినియోగదారులకు హామీ ఇస్తుంది.

డ్యురియన్‌ ఫర్నిచర్‌ వద్ద కస్టమర్‌లు తమ షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన వివిధ ప్రయోజనాల లాభాలను కూడా పొందవచ్చు. మెరుగైన పరిజ్ఞానం ఉన్న సిబ్బంది నుండి నైపుణ్యం తో కూడిన మార్గదర్శకత్వం, కస్టమర్‌లు తమ ప్రాంగణాలను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దటానికి అనువుగా సరైన ఫర్నిచర్ డిజైన్లను కనుగొనేలా చేస్తుంది. అదనంగా, సులభమైన EMIలతో సహా సౌకర్యవంతమైన చెల్లింపు ఎంపికలు వారి కలల ఫర్నిచర్‌ను ఇంటికి తీసుకురావడాన్ని గతానికంటే మిన్నగా సులభతరం చేస్తాయి. డ్యురియన్‌ ఫర్నిచర్ సౌకర్యవంతమైన డెలివరీ, ఇన్‌స్టాలేషన్ సేవలను కూడా అందిస్తుంది, కొనుగోలు నుండి సెటప్ వరకు సౌకర్యవంతమైన డెలివరీ అనుభవాన్ని అందిస్తుంది. 5 సంవత్సరాల వారంటీ నాణ్యత పట్ల వారి నిబద్ధతకు నిదర్శనం.

ఎంచుకోవడానికి 1000 కంటే ఎక్కువ డిజైన్లతో ఫర్నిచర్ యొక్క విస్తృతశ్రేణి ఎంపికను డ్యురియన్‌ ఫర్నిచర్ అందిస్తుంది. ప్రీమియం సోఫాలు, ఆకర్షణీయమైన డైనింగ్ సెట్‌లు, పూర్తి విశ్రాంత అనుభవాలను అందించే బెడ్‌లు, స్టోరేజ్ ఎసెన్షియల్స్, మరిన్నింటి నుండి ఎంచుకోవచ్చు, బ్రాండ్ వివిధ అభిరుచులు, ప్రాధాన్యతలకనుగుణంగా విస్తృతమైన కలెక్షన్ ను అందిస్తుంది. ఆధునిక భారతీయ గృహాల కోసం ఉద్దేశపూర్వకంగా రూపొందించబడిన వీరి ఫర్నిచర్ క్లాసిక్, మిడ్-సెంచరీ మోడ్రన్, కాంటెంపరరీతో సహా వివిధ శైలులలో అందుబాటులో ఉంది.

ఎంపిక చేసుకున్న ఫర్నిచర్ పై ప్రత్యేకమైన రీతిలో ప్రారంభోత్సవ తగ్గింపు ఆఫర్లను కూడా వీరు అందిస్తున్నారు. కస్టమర్‌లు తమ ఇళ్లు, కార్యాలయాలను అధిక-నాణ్యతతో రూపొందించిన ఫర్నిచర్‌తో తీర్చిదిద్దడానికి ఇది అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. విశాఖపట్నంలో ప్రీమియం ఫర్నిచర్ కోసం వెతుకుతున్న వ్యక్తులు, కాలాతీత ఫర్నిచర్ ఫేవరెట్స్, అత్యుత్తమ షాపింగ్ అనుభవం కోసం షోరూమ్‌ని సందర్శించవచ్చు. అంతేనా, కస్టమర్లు తమ ఇళ్లను ఆకర్షణీయంగా మార్చే ఫర్నిచర్ ను కనుగొనడంలో సహాయం పొందడానికి డ్యురియన్‌ నిపుణులతో సంప్రదించవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News