Tuesday, December 24, 2024

శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లో డ్యురియన్‌ 2వ స్టోర్‌ను ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ నగరవాసుల నుంచి ప్రోత్సాహపూరకమైన స్పందన అందుకున్న తరువాత దేశంలో సుప్రసిద్ధ లైఫ్‌స్టైల్‌ ఫర్నిషింగ్‌ బ్రాండ్‌ డ్యురియన్‌ ఫర్నిచర్‌, నగరంలో తమ రెండవ స్టో్‌ర్‌ను శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ వద్ద 02 ఏప్రిల్‌ 2023 న ప్రారంభించింది. వేసవి ప్రారంభమైన వేళ ఇది ప్రారంభం కావడం విశేషం. ఈ విస్తారమైన స్టోర్‌ 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, హైదరాబాద్‌లో అతి పెద్ద షాపింగ్‌ కేంద్రాలలో ఒకటైన శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌ వద్ద ఉంది. ఇది అత్యున్నత నాణ్యత కలిగిన విలాసవంతమైన ఫర్పిచర్‌ వస్తువులను ప్రదర్శిస్తుంది.

కాలాతీత మరియు అత్యధిక మన్నిక కలిగిన ఫర్నిచర్‌ పరంగా డ్యురియన్‌ అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది 1000కు పైగా డిజైన్లను మీ ఇంటి కోసం అందిస్తుంది. వీటిలో సోఫా సెట్‌లు, రిక్లైనర్స్‌, కాఫీ, సైడ్‌ టేబుల్స్‌, లాంజ్‌ ఛైర్స్‌, డైనింగ్‌ రూమ్‌ ఫర్నిచర్‌, స్టడీ టేబుల్స్‌, డబ్ల్యుఎఫ్‌ హెచ్‌ ఎసెన్షియల్స్‌, ప్రీమియం బెడ్‌ రూమ్‌ ఫర్నిచర్‌, వీటిలో కింగ్‌ మరియు క్వీన్‌ సైజ్‌ బెడ్స్‌ మరియు మరెన్నో ఉన్నాయి. మిడ్‌ సెంచురీ మోడ్రన్‌ క్లాసిక్స్‌ మొదలు సమకాలీన డిజైన్స్‌ వరకూ వీరి వద్ద విస్తృత శ్రేణి ఉత్పత్తులు ఎలాంటి డెకార్‌తో అయినా మిళితమయ్యే రీతిలో ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద ఫర్నిచర్‌ డెస్టినేషన్‌గా నిలిచిన తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటుగా డ్యురియన్‌ ఇప్పుడు 50కు పైగా స్టోర్లను దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.

ప్రత్యేకంగా ప్రారంభోత్సవ ఆఫర్‌ను ఎంపిక చేసిన గృహ, ఆఫీస్‌ ఫర్నిచర్‌పై అందిస్తుంది. హైదరాబాద్‌ నగర వాసులకు ప్రీమియం ఫర్నిచర్‌ వస్తువులను ఈ స్టోర్‌ అందిస్తుంది.

డ్యురియన్‌ ఫర్నిచర్‌ గురించి:

భారతదేశపు సుప్రసిద్ధ ఓమ్నీ ఛానెల్‌ లగ్జరీ ఫర్నిచర్‌ బ్రాండ్‌ డ్యురియన్‌ను 1985లో శ్రీ సజ్జన్‌ డొకానియా ప్రారంభించారు. భారతదేశపు ఒన్‌స్టాప్‌ విలాసవంతమైన ఫర్నిచర్‌ సొల్యూషన్‌ బ్రాండ్‌గా నిలుపాలనే సాహసోపేత లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. నాణ్యత, ఆవిష్కరణ, వినియోగదారుల లక్ష్యిత విధానం వంటి వాటి పట్ల ఈ బ్రాండ్‌ నిబద్ధత, భారతీయ ఫర్నిచర్‌ పరిశ్రమలో అత్యంత నమ్మకమైన పేరుగా మారేందుకు తోడ్పడింది. డ్యురియన్‌ తమ వినియోగదారులకు తమ ఫర్నిచర్‌ను వ్యక్తిగతీకరించుకోవడంతో పాటుగా అనుకూలీకరించుకునే అవకాశం ఉంది. తమ అభిరుచి, సౌకర్యం ఆధారంగా వీటిని రూపొందించుకోవచ్చు. వీటితో పాటుగా, వారి ఉన్నతమైన సేవలలో సాటిలేని ఐదు సంవత్సరాల వారెంటీ, కాంప్లిమెంటరీ వ్యక్తిగతీకరించిన నిపుణుల సహాయం, సౌకర్యవంతమైన ఈఎంఐ అవకాశాలు, సౌకర్యవంతమైన డెలివరీ , మరియు మరెన్నో ఒత్తిడి రహిత కొనుగోలు అనుభవాలను అందిస్తాయి.

ఒకవేళ మీరు హైదరాబాద్‌లో ఫర్నిచర్‌ కొనుగోలు చేయాలనుకుంటే, శరత్‌ సిటీ క్యాపిటల్‌ మాల్‌లోని డ్యురియన్‌ స్టోర్‌ను సందర్శించండి. అక్కడ మీరు లైవబల్‌ లగ్జరీని ఆస్వాదించండి. మీరు డిజైన్‌ నిపుణులతో కూడా మాట్లాడి మీ ఇంటికి, మీ మనసుకు నచ్చే సరైన ఉత్పత్తులను ఎంచుకోండి.డ్యురియన్‌ ఫర్నిచర్‌ గురించి మరింతగా తెలుసుకోవడానికి www.durian.in చూడండి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News