Monday, January 20, 2025

సిఎం కెసిఆర్ హయాంలో ప్రజాఆరోగ్యానికి పెద్దపీట : ముఠాగోపాల్

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ హయాంలో ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధానత్య ఇస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. కరోనా సమ యంలో ప్రజలను కాపాడిన వైద్యుల సేవలు మరువలేమని కొనియాడారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బిఆర్‌ఎస్ బోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షులు వై. శ్రీని వాస్ ఆధ్వర్యంలో ముషీరాబాద్, భోలక్‌పూర్ పిహెచ్‌సి కేంద్రంలో శనివారం వైద్యులను, బోలక్‌పూర్‌లోని డాక్టర్ శేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసిహంలు శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో వైద్య సేవల విలువ, వైద్యుల విలువ అత్య ధిక ప్రా ధాన్యతతో కూడుకున్నదనే విషయం కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి అర్థమైందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రజా ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతూ ప్రజలకు నాణ్య మైన వైద్య సేవలు అందజేస్తున్నట్టు చెప్పారు. బిఆర్‌ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు ముఠా జైసింహ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో సైనికులు ఎంత అవసరమో వైద్యులు కూడా అంతే అవసరమని అన్నారు. కరోనా వంటి విపత్కర పరి స్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యు లు సేవలు అందజేశారని గుర్తు చేశారు. డాక్టర్ అనిల్, డాక్టర్ లారా మీనన్, డాక్టర్ శ్రీమాధవి, పీహెచ్‌వో భాగ్య లక్ష్మీ, హౌస్ సర్జన్లు డాక్టర్ ఫిరోష్, డాక్టర్ రుతశ్రీ, బిఆర్‌ఎస్ నాయకులు శివ ముదిరాజ్, శంకర్ గౌడ్, వంగాల నర్సింగ్ రావు, రహీం, మునావర్ చాంద్, జునేద్ బాగ్దద్, జబ్బార్, మక్బుల్, శ్రీధర్ రెడ్డి, ఆకుల అరుణ్, శ్రీధరాచారి, ఏయిర్‌టెల్ రాజు, పరుశురామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News