Wednesday, January 22, 2025

దురంతో ఎక్స్ ప్రెస్ బోగీలో మంటలు… ప్రయాణికుల పరుగులు

- Advertisement -
- Advertisement -

కుప్పం: దురంతో ఎక్స్‌ప్రెస్‌లో స్వల్పంగా మంటలు రావడం కలకలం సృష్టించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హవ్‌డా వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌-9 బోగీలో స్వల్పంగా మంటలతో పొగలు వచ్చాయి. గమనించిన డ్రైవర్‌ కుప్పం రైల్వేస్టేషన్‌లో రైలును ఆపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు తెలుసుకుని కిందికి దిగి పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. దీంతో తిరిగి రైలు బయల్దేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News