Wednesday, January 22, 2025

చాలా గ్లామరస్ రోల్ నాది

- Advertisement -
- Advertisement -

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలవుతుంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ నివేదా పేతురాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఈ సినిమా స్క్రిప్ట్ చాలా నచ్చింది. ఇది చాలా యూనిక్ కథ. విశ్వక్ సేన్ డైరెక్షన్ చేయడం మరింత స్పెషల్ గా మారింది. నా కెరీర్ లో మొదటిసారి ఇలాంటి పాత్ర చేశాను. డ్యాన్సులు చేయడం కొత్తగా అనిపించింది. చాలా గ్లామరస్ రోల్ నాది. హీరో నిర్మాతగా చేయడం వేరు. కానీ దర్శకత్వం ఒక ప్రధాన భాద్యత. హీరో, నిర్మాత దర్శకత్వం ఇలా మూడు భాద్యతలని తీసుకున్నారు విశ్వక్. నిర్మాతగా పూర్తి న్యాయం చేశాడు. ఇక దర్శకుడిగా విశ్వక్ ఎనర్జీ చాలా గొప్పగా అనిపించింది. నేను పని చేసిన దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత అంత ఎనర్జీ ఉన్న దర్శకుడిని విశ్వక్ సేన్‌లో చూశాను. దాస్ కా ధమ్కీ’ మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. విశ్వక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా అతనికి మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News