Tuesday, December 24, 2024

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో దసరా, దీపావళి వీక్లి బంపర్ డ్రా లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ హైదరాబాద్:  సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రస్తుతం అన్ని పండగ సీజన్లను దృష్టిలో ఉంచుకుని అన్ని తరాల కుటుంబ సభ్యుల కోసం – ఆల్ న్యూ ఫెస్టివ్ కలెక్షన్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ పేరుతో సరికొత్త విక్రయాలకు శుభారంభం చేసింది. దీనిలో పట్టుచీరల సరికొత్త పండగ కలెక్షన్స్ ప్రత్యేక ఆకర్షణ. దసరా, దీపావళి సందర్భంగా అక్టోబర్ 7 నుంచి నవంబరు 11 వరకు లక్కీ డ్రా, బంపర్ డ్రాలను నిర్వహిస్తోంది. ముందు ఎన్నడూ లేని విధంగా కనీవినీ ఎరుగని రీతిలో – అక్టోబర్ 28న దసరా బంపర్ డ్రాలో 20 కార్లు, నవంబరు 11న దీపావళి బంపర్ డ్రాలో 15 కార్లు అందుకునే అదృష్ట విజేతలను ప్రకటిస్తారు. తెలంగాణలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ షోరూమ్స్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తించే ఈ స్కీములో 2500 మంది విజేతలకు రూ.5 కోట్ల విలువ చేసే అద్భుతమైన బహుమతులను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇస్తోంది. వీటిలో లక్కీడ్రాలో – 35 ఆల్టో కార్లు, 100 గ్రాముల బరువున్న 600 వెండి గ్లాసులు, 600 టిసిల్ 32 టీవీలు, 600 వెట్ గ్రైండర్లు, 665 ఫైరోబోల్ట్ స్మార్ట్ వాచీలు ఉన్నాయి.

ప్రతి శనివారం రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత వీక్లీ డ్రా తీసి, విజేతల పేర్లు ప్రకటించడం ఇందులోని విశేష ఆకర్షణ. తెలంగాణ రాష్ట్రంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి రూ.500ల కొనుగోలుపై ఒక లక్కీడ్రా కూపన్ పొందగలరు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ ప్రకటన ద్వారా తెలిపింది. ఈసందర్భంగా ఆసంస్థ యాజమాన్యం మాట్లాడుతూ, తమ షోరూంలో శారీస్ వేర్, మెన్స్‌వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చూడీదార్స్, లెహంగాస్, లెగ్గింగ్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్ లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణమైన దసరా-దీపావళి సందర్భంగా ప్రతిరోజూ అద్భుతమైన కలెక్షన్లు అతితక్కువ ధరలకే లభిస్తాయని వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News