Thursday, December 19, 2024

ఈటీవీలో ద‌స‌రా సంబ‌రాల జోరు

- Advertisement -
- Advertisement -

ఈ ద‌స‌రా ప్రేక్ష‌కుల‌కు మ‌రింత క‌నుల విందుగా మార‌నుంది. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకునేలా ప్లాన్ చేసిందిఈటీవీ. స్టార్ క‌మెడియ‌న్ అలీ, బ్ర‌హ్మాజీ, సంగీత‌, ఆది, తాగుబోతు ర‌మేష్‌, శ్రీప్రియ‌, మ‌హేశ్వ‌రి, జ్యోతి, శుభ‌శ్రీ, రూప‌, భూమిక‌, రామ్ ప్ర‌సాద్‌, రియాజ్‌, న‌రేష్ పండు, నందు ఈ సంబ‌రాల్లో భాగం అవుతున్నారు. ఒక గ్రామంలో ద‌స‌రా పండుగ‌ను స‌ర‌దాగా ఎలా జ‌రుపుకుంటార‌నే విష‌యాన్ని తెలుసుకోవాలంటే ఈటీవీలో చూడాల్సిందే.

యాంక‌ర్ నందు త‌న‌దైన శైలిలో ద‌స‌రా వేడుక‌ను మ‌రింత ప్ర‌త్యేకంగా మార్చుతున్నారు. వేదిక‌పై సంప్రదాయ నృత్యాలు, పాట‌ల‌తో ఈవెంట్ క‌ల‌ర్‌ఫుల్‌గా మెప్పించ‌నుంది. ఎన్నో ఆట పాట‌ల‌తో సర‌దా సంభాష‌ణ‌ల‌తో సాగే ఈ కార్య‌క్ర‌మం అంద‌రినీ మెప్పించ‌నుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News